top of page
MediaFx

రామ్‌ చరణ్ వద్ద అప్పు చేసిన పవన్ కల్యాణ్..? 🚀

జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ 70వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో పిఠాపురం నుంచి సంచలన విజయాన్ని కైవసం చేసుకున్నారు. జనసేన 21 స్థానాల్లో గెలుపొందినది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టారు. తనకు ఓఎస్‌డీగా యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజను నియమించారు. కృష్ణతేజను ఏపీకి పంపించాలంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. పవన్ ప్రమాణ స్వీకార సమయంలో కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగారు.

ఎన్నికల ముందు పవన్ కౌలు రైతులకు తన సొంత డబ్బుతో లక్ష రూపాయల చొప్పున పంపిణీ చేశారు. ఈ మధ్యనే మరో విషయం బయట పడింది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ వద్ద కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీకి కాదు, తాను సినిమాల్లోకి రాకముందు తీసుకున్న అప్పు.

పాకెట్ మనీగా చిరంజీవి ఇచ్చిన డబ్బులు చాలకపోవడంతో రామ్ చరణ్ వద్ద నుంచి కొంత సొమ్ము తీసుకునేవారు. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. పాకెట్ మనీకి డబ్బులు తీసుకున్న పవన్ కల్యాణ్ ఈరోజు లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచే స్థాయికి చేరుకున్నారని, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ శ్రమకు తగిన ఫలితం దక్కిందని మెగా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


bottom of page