top of page
MediaFx

పవన్ కల్యాణ్‌కి 21 నంబర్ తో ప్రత్యేక అనుబంధం! ✨🗳️

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు 21 అంకెకు ఏదో ప్రత్యేకమైన సంబంధం ఉన్నట్టుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేసిన జనసేనాని తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనకు 21 సీట్లు కేటాయించారు. వైసీపీ తీవ్రంగా హేళన చేసినప్పటికీ, పవన్ వెనక్కి తగ్గలేదు. తాను 21 సీట్లకు ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందో వివరించి పార్టీ నేతలకు ఒప్పించారు. 🗳️💪

సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మరే పార్టీ సాధించని ఘనతను సాధించారు. 21 అసెంబ్లీ స్థానాలతో పాటు, పోటీ చేసిన రెండు లోక్‌సభ స్థానాలను కూడా గెలుచుకుని వందకు వంద శాతం విజయం సాధించారు. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ గేట్లు కూడా పవన్‌ను తాకనివ్వబోమని వైసీపీ నేతలు ప్రచారం చేసిన వేళ, 21వ తేదీనాడు 21 మంది ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో 21వ నంబర్‌కు పవన్‌కు ఏదో ప్రత్యేకమైన అనుబంధం ఉందని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషం పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. 🎉🏛️


bottom of page