top of page

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పవన్ సంచలన నిర్ణయం..


అందరిలో దేశభక్తి పెంపొందించాలని, ప్రతి గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సెలబ్రేట్ చేయాలని పవన్ కళ్యాణ్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ పంచాయితీల్లో ఆగస్టు 15న వేడుకలకు ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇస్తున్నారు. అయితే ఈ నిధులను ఒకేసారి గణనీయంగా పెంచింది ఏపీ ప్రభుత్వం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆ రోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత ఉండకూడదని, అందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తూ గతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. 2011 జనాభా ఆధారంగా 5 వేలులోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, 5వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేలు అందించనున్నారు. ఈ మొత్తంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ డబ్బుతో పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి, జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, పంచాయితీ ఉద్యోగులు అంతా ఇందులో పాల్గొనాలని సూచించారు పవన్ కళ్యాణ్. ఇటీవల పలువురు సర్పంచ్ లు పవన్ కళ్యాణ్ ని కలిసి గత 34 ఏళ్లుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వంద, 250 రూపాయల చొప్పునే ఇస్తున్నారని, ఆ డబ్బులతో జెండా పండుగను నిర్వహించలేకపోతున్నామని వాపోయారు. దీంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకొని పంచాయితీలకు ప్రభుత్వం తరపున స్వాతంత్ర్య దినోత్సవ, గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి పెద్ద మొత్తాలు ప్రకటించారు.



Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page