top of page

🌟 పవన్‌ కళ్యాణ్‌ దగ్గరికి క్యూ కడుతోన్న తెలంగాణ బీజేపీ అభ్యర్థులు..

📢 బీజేపీ ఏర్పాటు చేసిన బీసీ ఆత్మ గౌరవ సభలో ఆసక్తి కర సన్నివేశం కనిపించింది. 🤩 ఇప్పటికే బీజేపీ జనసేన పోత్తు కుదిరిన తరువాత ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. 🌠

సభ ఆరంభంలోనే ముఖ్య నాయకులతో పాటు పవన్ కళ్యణ్ ముందు గానే సభ స్థలికి చేరుకున్నారు. 🤝 మోదీ రావడానికి కొంచం టైం పట్టడంతో వేదికపైన అందరు కూర్చున్నారు. 🕊️ అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒక్కరోక్కరుగా జనసేన అధినేత దగ్గరికి వచ్చి, తమను తాము పరిచయం చేసుకున్నారు. 🤗

అంతే కాదు తాము ఏ ప్రాంతం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో చెప్తూ ప్రచారానికి మా ప్రాంతానికి రావాలని బలంగా కోరారు. 💪 ముఖ్యమంగా హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతపు అభ్యర్థులు పవన్ కళ్యణ్ వచ్చి ప్రచారం చేయాలనీ కోరారు. 📣 పవన్‌ సైతం ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 📡 సాధారణంగా ఎన్నికలు వచ్చినపుడు సినిమా స్టార్లు ప్రచారం చేయడం సర్వసాధారణమైన విషయం. 🎬 ఇక పవన్‌ కళ్యాణ్‌ లాంటి స్టార్‌ హీరో ప్రచారానికి వస్తే కచ్చితంగా తమకు మేలు జరుగుతుందని నాయకులు భావిస్తున్నారు. 🌠 అందుకే ప్రచారానికి పవన్‌ను ఉపయోగించుకోవాలని తెలంగాణ బీజేపీ అభ్యర్థులు భావిస్తున్నారు. 🗳️ చూడాలి మరి పవన్‌ ప్రచారంలో పాల్గొంటారో లేదో. 🚀

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page