top of page

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేసిన ఓజీ టీమ్..


పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈఏడాది చాలా ప్రత్యేకంగా ఉండనుంది. ఎందుకంటే, ఈ ఏడాది ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు కావడం ఆయనకు ఇది ప్రత్యేకం. ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ రోజున ఆయన అభిమానులకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు ఓజీ మూవీ టీమ్. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్ర బృందం ఆయన పుట్టినరోజు సందర్భంగా మొదటి పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేసింది. ఓజీ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ మొదటి పాటను పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదల చేయనున్నట్లు దానయ్య ప్రకటించారు. దాంతో ఈ సాంగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా నటిస్తున్నాడు. అలాగే పవన్ సరసన అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page