ఏపీలో రాజకీయాలు చకచక మారిపోతున్నాయి. పొత్తులతో ప్రత్యర్ధులు సిద్ధమవుతుంటే.. వాటికి కౌంటర్ స్ట్రాటజీలతో వైసీపీ కూడా రంగంలో దిగింది. త్రిముఖ పోరు ఉండదు.. ఏపీలో ఉండేది ద్విముఖ పోరే అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల పార్టీ మండల అధ్యక్షుల సమావేశంలో చాలా క్లారిటీతో చెప్పేశారు. పైగా సీఎం పదవిపై పవన్ కల్యాణ్ చెప్పిన మాటలనే అస్త్రాలుగా మలుచుకున్న వైసీపీ.. బలంగా ప్రయోగిస్తుంది.
ఏపీలో రాజకీయాలు చకచక మారిపోతున్నాయి. పొత్తులతో ప్రత్యర్ధులు సిద్ధమవుతుంటే.. వాటికి కౌంటర్ స్ట్రాటజీలతో వైసీపీ కూడా రంగంలో దిగింది. త్రిముఖ పోరు ఉండదు.. ఏపీలో ఉండేది ద్విముఖ పోరే అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల పార్టీ మండల అధ్యక్షుల సమావేశంలో చాలా క్లారిటీతో చెప్పేశారు. పైగా సీఎం పదవిపై పవన్ కల్యాణ్ చెప్పిన మాటలనే అస్త్రాలుగా మలుచుకున్న వైసీపీ.. బలంగా ప్రయోగిస్తుంది. స్వయంగా సీఎం రంగంలో దిగి మరీ విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. రాజకీయ పార్టీ పెట్టి పదేళ్లయినా పవన్ కళ్యాణ్ 175 సీట్లలో అభ్యర్ధుల్ని కూడా పెట్టలేని పరిస్ధితిలో ఉన్నారన్న సీఎం… ఒక్కో ఎన్నికకూ ఒక్కో రేటుకు పార్టీని అమ్ముకునే ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. సింగిల్‌గా వచ్చే దమ్ముందా అంటూ సవాల్ కూడా విసురుతున్నారు.. ఇంతకీ వైసీపీ సింగిల్ గా రండి అని ఎందుకంటోంది.? మైండ్‌గేమ్ ఆడుతుందా? రెచ్చగొట్టి పొత్తులను స్టార్టింగ్‌లోనే బ్రేక్ చేయాలనుకుంటుందా?