🏛️ పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లు మాత్రం 2029 నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. 👩⚖️ జనాభా లెక్కలు, డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత మహిళా రిజర్వేషన్స్ అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. 👩⚖️🗳️
ఈ బిల్లు అమలైతే చట్టసభల్లో 33శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సిందే. వచ్చే ఏడాది ఏర్పడే కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే జనగణన, నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణను చేపడుతుందని బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 📢 లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. 🇮🇳🗳️ మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక చారిత్రక చట్టమని, మహిళా సాధికారతకు ఇది తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. 👩⚖️🏛️ రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంగా ఎక్కువ సమయం మహిళా ఎంపీలే సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. 👩⚖️ మహిళలకు సంబంధించి ఎంతో కీలకమైన బిల్లుపై చర్చ జరిగే సమయంలో సభాధ్యక్ష స్థానంలో మహిళలు ఉండటం సముచితమని చర్చను ప్రారంభించిన సమయంలోనే సభాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. “హిందూ క్యాలెండర్ ప్రకారం ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు. ఇది యాదృచ్ఛికం మాత్రమే ’’ అని రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ అన్నారు. 🇮🇳📺 పార్టీలకు అతీతంగా రాజ్యసభలోని మహిళా ఎంపీలదరూ సభాకార్యక్రమాలు నిర్వహించారు. 🇮🇳🗳️ రాజ్యసభ టీవీలో ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా మహిళా ఎంపీలను ప్రత్యేకంగా చూపించారు కూడా. 📺👩⚖️