top of page

ఓటీటీలోకి 'పరేషాన్' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే. 📺👥

మసూద నటుడు తిరువీర్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం 'పరేషన్'. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో పావని కరణం హీరోయిన్ గా నటించింది.

మసూద నటుడు తిరువీర్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం 'పరేషన్'. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో పావని కరణం హీరోయిన్ గా నటించింది. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బన్నీ అబిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శ్రుతి రియాన్, బుద్దాఖాన్ రవి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వాసు పెండెం సినిమాటోగ్రఫీ ఇచ్చారు. వాల్టెయిర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీలివ్ దక్కించుకుంది. ఆగస్టు 02 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.😃

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page