🔵 సీపీఎం, సీపీఐ చెరో ఐదు స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరుతున్నాయి. 👤 ఈ పార్టీల మధ్య పొత్తుల అంశం జాతీయ స్థాయిలోనే నడుస్తోంది. 🌐
అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీపీఎం, సీపీఐ నేతలతో చర్చలు జరిపి.. 👥 చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు ప్రతిపాదన పెట్టారనే టాక్ వినిపిస్తోంది. 🔊 సీపీఐ కోరుకున్న ఐదు సీట్లలో మునుగోడు లేదంటే కొత్తగూడెం ఇస్తామని చెప్పగా.. 👀 చివరికి కొత్తగూడెంకు సీపీఐ ఓకే చెప్పినట్లు సమాచారం. 🗞️ మరోటి తాము అనుకున్నట్లుగా చెన్నూరు సీటు ఇస్తామనని కాంగ్రెస్చెప్పినట్టు తెలుస్తోంది. 📢 సీపీఎం కోరుకున్న ఐదు సీట్లలో మిర్యాలగూడ సీటు ఇస్తామంటోంది కాంగ్రెస్. 🤝 మరో సీటుపై క్లారిటీ ఇవ్వలేదు. 🚫
🟠 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమకు తప్పనిసరిగా సీటు ఇవ్వాల్సిందేనని సీపీఎం పట్టుపడుతోంది. 🌄 ఇప్పటికే సీపీఎం ప్రతిపాదించిన సీట్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, మధిరలో అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించగా.. 🏞️ పాలేరులో మాత్రమే అభ్యర్థిని ప్రకటించలేదు. 🤷♂️ ఈ సీటు తమకు ఇవ్వాల్సిందేనని సీపీఎం జాతీయస్థాయి నుంచి గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. 💼 రెండో సీటు కింద తమకు చెన్నూరు ఇస్తామనడంపై సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 😡
🟢 ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సీటులో పోటీ చేయాల్సిందేనని సీపీఐ గట్టిగా పట్టుబడుతోంది. ⚖️ కాంగ్రెస్ప్రతిపాదించినట్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు సీటుకు ఓకే చెప్పాలని డిమాండ్ చేస్తోంది. 🗳️ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సీపీఐ పోటీ చేయకపోతే, పార్టీకి తీవ్ర నష్టమంటోంది. 😔👤