top of page

రామ్ RAPO షూటింగ్ పూర్తి

కంటెంట్ కన్నా కలెక్షన్స్ ను నమ్మి సినిమా తీసే డైరెక్టర్ బోయపాటి శ్రీను . మాస్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని కొత్త సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది . తాత్కాలికంగా "బోయపాటి రాపో" అని పేరు పెట్టారు. రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ చిత్రo టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. రీసెంట్ గా షూటింగ్ నిమిత్తం మైసూర్ వెళ్లిన టీమ్ ప్రస్తుతం మైసూర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బోయపాటి శ్రీను తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశాడు. ఈ సినిమా అనుకున్న దానికంటే ముందే విడుదలయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20, 2023న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page