top of page

బంగ్లాపై పాక్‌ విజయం.. పాయింట్ల పట్టికలో మార్పులు.. 🏏🏆

ప్రపంచకప్-2023లో పాకిస్థాన్ ఎట్టకేలకు ఓ భారీ విజయం సాధించింది. మంగళవారం (అక్టోబర్‌ 31) కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి వరుస పరాజయాలకు బ్రేక్‌ వేసింది.

ప్రపంచకప్-2023లో పాకిస్థాన్ ఎట్టకేలకు ఓ భారీ విజయం సాధించింది. మంగళవారం (అక్టోబర్‌ 31) కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి వరుస పరాజయాలకు బ్రేక్‌ వేసింది. వరల్డ్‌ కప్‌ టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది మూడో విజయం. ఈ మ్యాచ్‌కు ముందు పాక్‌ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. బంగ్లాపై గెలుపుతో ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది పాక్‌. ఈ విజయంతో ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ సెమీస్‌ అవకాశాలు సజీవంగా నిలిచాయి. టోర్నీలో బాబర్‌ సేనకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్ తో ఆ జట్టు ఆడాల్సి ఉంది. నవంబర్ 4న న్యూజిలాండ్‌తో, నవంబర్ 11న ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ జట్టు తలపడుతోంది. సెమీఫైనల్‌కు చేరుకోవడానికి పాకిస్థాన్‌కు ఇంకా అవకాశాలు ఉన్నాయి. రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు ఇతర జట్ల ప్రదర్శనపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. 🏏🏆


Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page