top of page
Shiva YT

🌟🎖 చిరంజీవికి పద్మ విభూషణ్.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..🌟🏅

🇮🇳 ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది. అయితే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని సత్కరించింది కేంద్రం. ఆయనతోపాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ నటి వైజయంతిమాలకు సైతం దేశంలోని రెండో అత్యున్నత పురస్కారాన్ని అందించింది. దీంతో మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పద్మ విభూషణ్ పురస్కారానికి ఈ ఏడాది చిరంజీవి పేరు ప్రకటించడంపై అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు.

“దేశంలోనే రెండో అత్యున్నతమైన పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపికైనందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. కుటుంబం, అభిమానులతోపాటు యావత్ తెలుగు వారికి ఇది ఎంతో గర్వకారణం. ఈ విజయంపై సంతోషంగా ఉన్నాను. మేము గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చారు బన్నీ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. అంతకు ముంద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. 🌐🌟

bottom of page