ట్యాంక్ బండ్‌వైపు రహదారులను మూసివేసినప్పటికీ సెక్రటేరియట్ వద్దకు యువకులు భారీగా చేరారు. దీంతో పోలీసులు సైతం క్రౌడ్‌ను కట్టడి చేయలేక చేతులు ఎత్తివేశారు.🚨👮♂️
కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి డ్రంకన్ డ్రైవ్ చెకింగ్‌లు చేశారు. సిటీ పరిధిలోని పబ్‌లు, బార్లు, రిసార్ట్స్ వద్ద పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. బేగంపేట, లంగర్ హౌస్ ఫ్లై ఓవర్లు మినహా3 కమిషనరేట్లలోని అన్ని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జిలను మూసివేశారు. 59 ట్రాఫిక్ పీఎస్‌లలో మొత్తం 260 చెక్ పాయింట్ల వద్ద ముమ్మర తనిఖీలు చేశారు. టీ న్యాబ్ పోలీసులు డ్రగ్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహించారు. నక్లెస్ రోడ్స్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్‌వైపు రహదారులను మూసివేసినప్పటికీ సెక్రటేరియట్ వద్దకు యువకులు భారీగా చేరారు. దీంతో పోలీసులు సైతం క్రౌడ్‌ను కట్టడి చేయలేక చేతులు ఎత్తివేశారు.🚨👮♂️
మరోవైపు డ్రగ్ టెస్టుల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలోని పబ్స్, బార్లు, రెస్టారెంట్‌లలో పోలీసులు మఫ్టీలో వెళ్లి తనిఖీలు చేపట్టారు. స్నిప్పర్ డాగ్స్ ను కూడా తమ వెంట తీసుకెళ్లారు. 👮♂️
నిబందనలు ఎంతవరకు పాటిస్తున్నారనే దానిపై పరిశీలించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారి కోసం సెర్చ్ చేశారు. చెక్ పాయింట్స్ వద్ద 3 కమిషనరేట్ల పరిధిలో డ్రగ్స్ టెస్టులు చేశారు. దీంతో రాత్రి 11.30 గంటల వ్యవధిలోనే అంటే కేవలం రెండున్నర గంటల్లోనే మొత్తం 1060 కేసులు నమోదు చేశారు. పోలీసుల తనిఖీల్లో నలుగురు డ్రగ్స్ సప్లయర్లు పట్టుబడ్డారు. డ్రంకన్ డ్రైవ్ కేసులు, డ్రగ్ టెస్టుల కేసుల వివరాలను ఈ రోజు మీడియా సమక్షంలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.🚨👮♂️