top of page

ఓటీటీలోకి ‘కమిటీ కుర్రోళ్ళు’.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే.?


టాలీవుడ్ యువ న‌టులు సందీప్‌ సరోజ్‌, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌ వర్మ, ప్రసాద్‌ బెహరా ప్రధాన పాత్రధారులుగా వ‌చ్చిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వ‌హించ‌గా.. నిహారిక కొణిదెల సమర్పణలో… పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. చిన్న సినిమాగా వ‌చ్చిన ఈ చిత్రం ఆగస్టు 9న రిలీజై మంచి విజయం సాధించింది. ఇక ఇన్ని రోజులు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ అప్‌డేట్‌ను పంచుకుంది. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్​లో ఈ సినిమా త్వ‌ర‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. గోదావ‌రి జిల్లాల్లో పురుషోత్తంప‌ల్లి అనే గ్రామంలో జ‌రిగే భ‌రింకాళ‌మ్మత‌ల్లి జాత‌ర‌కు దానిలో భాగంగా చేసే బ‌లి చేటకు ఎంతో ప్రాశ‌స్త్యం ఉంది. అయితే ఈ జాత‌ర జ‌రిగే క్ర‌మంలో ఆ ఊరిలో స‌ర్పంచ్ ఎన్నిక‌లు వ‌స్తాయి. దీంతో ఈ ఎన్నిక‌ల్లో స‌ర్పంచ్‌గా పోటి చేసేందుకు ఊరి కుర్రాళ్ల‌లో ఒక‌డైన శివ (సందీప్ స‌రోజ్) ముందుకొస్తాడు. అయితే శివ ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డిన అనంత‌రం ఏం జ‌రిగింది. స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచారు? భ‌రింకాళ‌మ్మత‌ల్లి జాత‌రకు శివ‌కు సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.



Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page