top of page

🎬 ఓటీటీలోకి వచ్చేసిన ఫీల్‌గుడ్‌ మూవీ..

📅 ప్రస్తుతం థియేటర్లలో విడుదలైన నెలలోపే ఓటీటీల్లోకి సినిమాలు వస్తోన్న రోజులివి. 🎥 కొన్ని సినిమాలైతే రెండు మూడు వారాలకే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేస్తున్నాయి. 🗓️

అయితే ఒక సినిమా థియేటర్లలో విడుదలైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. అదే నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన ఫీల్‌ గుడ్ ఎమోషనల్‌ మూవీ జెట్టీ. 🌟 మత్స్యకారుల జీవితానికి ఒక చక్కటి ప్రేమకథను జోడించి సుబ్రహ్మణ్యం పిచ్చుక ఈ మూవీని తెరకెక్కించారు. 🎭 మాన్యం కృష్ణ, నందిత శ్వేతా హీరో, హీరోయిన్లుగా నటించారు. తేజస్విని బెహెర, ఎంఎస్‌ చౌదరి, జి.కిశోర్‌, గోపి, జీవ, శివాజీ రాజా, సుమన్‌ శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 🌟 గతేడాది (2022) నవంబర్ 4వ తేదీ థియేటర్లలో విడుదలైన జెట్టీ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 🌈 గ్రామీణ నేపథ్యం, అక్కడి కట్టుబాట్లు, ఆచార సంప్రదాయాలు, మత్స్యకారుల జీవన విధానాన్ని సాక్షాత్కరించేలా జెట్టీ మూవీని తెరకెక్కించారని కామెంట్లు వచ్చాయి. 🔍 నందమూరి బాలకృష్ణ, త్రివిక్రమ్ వంటి ప్రముఖులు ఈ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చారంటే ఈ మూవీలో ఉన్న కంటెంట్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 🎥 ఎన్నో ప్రశంసలు అందుకున్న ఉన్న జెట్టీ సినిమా సుమారు ఏడాది తర్వాత డిజిటల్‌ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. 📺 ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. 🍿 శుక్రవారం (నవంబర్‌ 17) నుంచే ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. 🌟

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page