top of page
Suresh D

ఆస్కార్ వేదికపై జాన్ సీనా రచ్చ..🎭

ఆస్కార్స్ లేదా అకాడెమీ అవార్డ్స్.. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సినీ అవార్డుల ఉత్సవాన్ని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంది. అయితే అలాంటి ఆస్కార్స్ వేదికపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరగుతూనే ఉంటుంది.

ఆస్కార్స్ లేదా అకాడెమీ అవార్డ్స్.. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సినీ అవార్డుల ఉత్సవాన్ని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంది. అయితే అలాంటి ఆస్కార్స్ వేదికపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అలాంటిదే ఒకటి అభిమానులను షాక్ గురి చేసింది. స్టార్ రెజ్లర్ జాన్ సీనా న్యూడ్ గా స్టేజ్ పైకి వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆస్కార్స్ వేడుకలో ఈసారి బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డును ఇచ్చే అవకాశం డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనాకు దక్కింది. ఈ అవార్డును ప్రజెంట్ చేయడానికి అతని పేరు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత జరిగిన ఘటన చూసి అందరూ షాక్ తిన్నారు. ఆ తర్వాత కోలుకొని స్టేజ్ కింద ఉన్న వాళ్లు తెగ నవ్వుకున్నారు. దీనికి కారణం జాన్ సీనా అసలు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా రావడం.తన ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా మాత్రం అడ్డుగా విన్నర్ పేరు ఉన్న కార్డు పెట్టుకొని వచ్చాడు. 😮


bottom of page