ప్రాచీన మతమైన హిందూమతంలో వ్రతాలు, పండుగలకు విశేష ప్రాధాన్యం ఉంది. ప్రతి పండుగకు దాని ప్రత్యేక ఆచారాలు ఉన్నాయి. ఈ పండుగలలో నాగ పంచమి ఒకటి. శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి నాడు జరుపుకునే నాగ పంచమిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు నాగుపాము పుట్టల వద్దకు వెళ్లి ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కానీ, కొందరు యువకులు మాత్రం భయం, భక్తి లేకుండా, సంప్రదాయ ఆచారాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా నాగరాజు ముందు కేకులు పెట్టి నాగపంచమి జరుపుకున్నారు. అందుకు అనుగుణంగా పాటలు కూడా పాడుతున్నారు.