Ratha Saptami 2024 తెలుగు పంచాగం ప్రకారం, మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని రథ సప్తమి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున సూర్య దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస వ్రతం ఆచరిస్తారు.
ఈ దీక్ష చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఈసారి 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం రోజున అచల సప్తమి వ్రతాన్ని ఆచరించనున్నారు. ఈ పవిత్రమైన రోజున మహిళలు సూర్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల మహిళలకు స్వేచ్ఛ, శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు. సూర్య దేవుడు ఉదయం వేళలో బ్రహ్మ స్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి, వేయికి పైగా కిరణాలతో మహేశ్వరుడిలా మారి, సాయంకాలం సంధ్యా వేళలో విష్ణుమూర్తి అవతారంలోలాగా కిరణాలతో మనోరంజకంగా ప్రసరింపజేస్తూ మనల్ని సంతోషపరుస్తాడు. సమస్త లోకంలోని చీకటిని తొలగించి, మనందరికీ వెలుగు ప్రసాదిస్తాడు. అంతటి గొప్ప విశిష్టత ఉన్న సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకునేందుకు రథ సప్తమి రోజున కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి. ఈ పరిహారాలతో కెరీర్లో పురోగతి సాధించడమే కాదు.. ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. ఈ సందర్భంగా రథ సప్తమి రోజున చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...