top of page
Shiva YT

💰 రూ.2వేల నోటు మార్పిడికి మరో 5 రోజులే గడువు..

📢 దేశంలో 2వేల రూపాయల నోటును మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఈ ఏడాది మే 19న ఆర్బీఐ ప్రకటించింది. 📅

కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గానీ సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువు విధించింది. 🏦 ఈ క్రమంలో ఆర్బీఐ విధించిన డెడ్‌లైన్‌ మరో ఐదు రోజుల్లో ముగియబోతోంది. ⏳ సెప్టెంబర్‌ 25 నుంచి 27 వరకూ బ్యాంకులు యథావిథిగా పనిచేయనున్నాయి. 🏛️ ఇక 28వ తేదీన గురువారం నాడు బ్యాంకులకు సెలవు. 🗓️ అనంతరం 29, 30 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి. 🏦 ఈ నాలుగు రోజుల్లోనే మీ వద్ద ఉన్న 2వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు వీలు ఉంటుంది. 💵 బ్యాంకుల నుండి అందిన డేటా ప్రకారం, సెప్టెంబరు 1 నాటికే 3.32 లక్షల కోట్ల రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లు ఆర్‌బీఐ వద్దకు చేరాయి. 🏦 దీంతో దేశంలో చలామణిలోకి పంపిన 2వేల నోట్లు 93 శాతం తిరిగి వచ్చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే వెల్లడించింది. 📈

bottom of page