top of page
Suresh D

టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో స్టార్ హీరోయిన్? భర్తతో విడాకులకు కారణం అదే అంటూ!


ప్రణీత్ రావు బృందం జరిపిన ట్యాపింగ్ వ్యవహారంలో రకరకాల కథనాలు వెలవడుతున్నాయి. బిజినెస్, సినీ, రాజకీయ, సాఫ్ట్‌వేర్ వర్గాలకు సంబంధించిన ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు. ప్రతీపక్ష పార్టీల నేతలతో టచ్ ఉన్న వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసి బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారనే కోణం మీడియా వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దక్షిణాదిలో అగ్రతారగా పేరున్న హీరోయిన్‌ ఫోన్‌ కూడా గత ప్రభుత్వంలోని కీలక నేతలు ట్యాప్ చేశారు. దాంతో ఆమె వైవాహిక జీవితం కూడా విచ్చిన్నమైంది. ఈ ట్యాపింగ్ వ్యవహారమే ఆ హీరోయిన్ తన భర్తకు దూరమయ్యేలా చేసింది. వారిద్దరి విడాకులకు కారణం టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అని విషయం ఇప్పడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

టెలిఫోన్ ట్యాపింగ్‌కు గురైన సినీతార విషయానికి వస్తే.. మలయాళ, తమిళ భాషల్లోనే కాకుండా తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ ఫ్యామిలీకి సంబంధించిన హీరోను వివాహం చేసుకొన్నది. ఆ తర్వాత సుమారు దాంపత్య జీవితం చక్కగా గడిపిన తర్వాత ఆ ఇద్దరు విడాకులు తీసుకోవడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారింది. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తు ఊపందుకొన్న నేపథ్యంలో సినీ తార పేరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఏం జరిగిందనే విషయం ఆసక్తికరంగా మారింది. నిజంగా హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేశారా? ఎందుకు చేశారు? దాంతో వారి వైవాహిక జీవితం విచ్ఛిన్నం అయిందనే ప్రశ్నలు ఇప్పుడు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి.

Related Posts

See All

తొలిసారి మిస్‌ యూనివర్స్‌ పోటీలో సౌదీ అరేబియా బ్యూటీ.. 💃

ఇస్లామిక్‌ దేశాలలో సౌదీ అరేబియా అత్యంత సంపన్న దేశం. ఈ దేశం నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అందాల పోటీల్లో పాల్గొన్న దాఖలాలు లేవు.

bottom of page