చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్‌కు టెక్ మార్కెట్లో మంచి క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన వన్‌ప్లస్ ఆ తర్వాత బడ్జెట్ మార్కెట్‌ను అట్రాక్ట్ చేస్తూ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల వన్‌ప్లస్ నార్డ్3 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే వన్‌ప్లస్ ఈ ఫోన్‌ను మిడ్ రేంజ్ బడ్జెట్ ప్రియుల కోసం తీసుకొచ్చింది.
వన్‌ప్లస్ నార్డ్3 5జీ స్మార్ట్ ఫోన్ ధరను లాంచింగ్ సమయంలో రూ. 33,999గా నిర్ణయించారు. ఈ ఏడాది జులైలో ఈ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. తాజాగా కంపెనీ ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే ఈ ఫోన్‌పై అదనంగా రూ. 2 వేలు డిస్కౌంట్ పొందొచ్చు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ అసలు ధర రూ. 33,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 29,999కే సొంతం చేసుకోవచ్చు.💸
ఇక 16 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర విషయానికొస్తే అసలు ప్రైజ్ రూ. 37,999గా ఉండగా రూ. 4 వేల డిస్కౌంట్‌తో రూ. 33,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్.. మిస్టీ గ్రీన్, టెంపెస్ట్ గ్రే కలర్స్‌లో లభిస్తోంది. వీటితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్, వన్ కార్డ్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.2 వేలు డిస్కౌంట్ లభిస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్3 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.74 ఇంచెస్‌తో కూడిన అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్3 5జీ ఫోన్.. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో లెన్స్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీని అందించారు.📱👀