సిల్వర్ స్క్రీన్‌పై క్రీడాకారుల జీవిత చరిత్రలు రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలు క్రీడా విభాగాల్లో రాణించిన స్పోర్ట్స్‌మెన్ బయోపిక్‌లు తెరపైకి వచ్చాయి. వీటిలో క్రికెటర్లపై వచ్చే బయోపిక్‌లకు మాత్రం సూపర్ క్రేజ్ ఉంటుంది. త్వరలోనే మరో స్టార్ క్రికెటర్ బయోపిక్ సందడి చేయనుంది. ఈ సారి టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) జీవిత చరిత్ర తెరపైకి ఆవిష్కృతం కానుంది. టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్, 200 నాటౌట్ సినిమాపై రవి బాగ్ చందక సంయుక్తంగా తెరకెక్కించనున్నారు.
యువ రాజ్ సింగ్ వ్యక్తిగత ప్రయాణంతోపాటు ఎంతో మంది స్పూర్తిగా నిలిచే ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన కీలక అంశాలను సినిమాలో చూపించబోతున్నారట. 2007 టీ 20 వరల్డ్ కప్‌లో ఆరు వరుస సిక్స్‌లు బాది సిక్సర్ల కింగ్‌గా అరుదైన ఫీట్ నెలకొల్పాడు యువీ. 2011 వరల్డ్ కప్ తర్వాత క్యాన్సర్ బారిన పడ్డ యువరాజ్ సింగ్.. అమెరికాలో చికిత్స తీసుకుని కోలుకున్నాడు.
ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో ఇంతకీ లీడ్ రోల్‌లో ఎవరు కనిపించబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. దీనిపై మేకర్స్ రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు.