top of page
MediaFx

ఆలివ్ ఆయిల్ తీసుకుంటే ఈ 6 లాభాలు పక్కా..🌿

ఆరోగ్యం విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. ప్రతీ ఒక్కరూ కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలోనే తినే ఆహారంలో విషయంలో జాగ్రత్త పడతారు. దీంతో ఏ వంట నూనె ఆరోగ్యానికి మంచిదని ఆలోచిస్తారు. ఇందులో బాగంగా ఆలీవ్ ఆయిల్ ఆరోగ్యానికి ఎన్ని లాభాలున్నాయో తెలుసుకోండి.


గుండె ఆర్యోగానికి..

నేటి కాలంలో చాలా మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలీవ్ ఆయిల్‌లో ఒలీక్ యాసిడ్, పాలిఫెనాల్స్ ఎక్కువగా ఉండడం వల్ల బీపిని కంట్రోల్ చేస్తుంది. దీంతో పాటు గుండె సమస్యల్ని తగ్గించడంతో పాటు గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.

జీర్ణక్రియ..

ఆలివ్ ఆయిల్‌ని వాడితే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఇందులోని మోనోశాచురేటెడ్ కొవ్వులు జీర్ణ సమస్యల్ని దూరం చేసి ప్రేగు కదలికల్ని ప్రోత్సహిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల పేగు వ్యాధులు, పూతల వంటి సమస్యలు దూరమవుతాయి. 

బ్రెయిన్ హెల్త్‌కి..

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి వంటి సమస్యలు ఉంటాయి. ఆలివ్ నూనెని వాడడం వల్ల బ్రెయిన్ హెల్త్‌గా మారి మతిమరుపు వంటి సమస్యలు దూరమవుతాయి. ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల ఇలా జరుగుతుందని చెబుతున్నారు.

రక్తపోటుని కంట్రోల్ చేయడం..

రక్తపోటుని తగ్గించడంలోనూ ఆలివ్ ఆయిల్ ముందుంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ధమనుల పనితీరుని మెరుగ్గా చేసి రక్తనాళాల్లో మంటని తగ్గించి రక్తపోటుని తగ్గిస్తాయి.

క్యాన్సర్స్‌కి వ్యతిరేకంగా..

నేటి కాలంలో చాలా మంది క్యాన్సర్స్‌తో బాధపడుతున్నారు. క్యాన్సర్స్‌ని దూరం చేయడంలో ఆలివ్ ఆయిల్‌ని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ముందుంటాయి. రొమ్ము, పెద్దప్రేగు, ప్రొస్టేట్ క్యాన్సర్ సహా క్యాన్సర్స్‌తో ఆలివ్ ఆయిల్ పోరాడతాయి. ఈ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలని కంట్రోల్ చేస్తాయి.

బరువు తగ్గడం..

కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఆయిల్‌ని వాడితే బరువు తగ్గుతారు. ఆలివ్ ఆయిల్ తీసుకోగానే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. 

bottom of page