top of page

త్వరలో ఒక్క రైలు కూడా తీరగదు⏰🚂

రైల్వే సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని పలు రైల్వే, ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

తమ డిమాండ్ నెరవేర్చకపోతే మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని హెచ్చరించాయి. వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధుల బృందం మార్చి 19న కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖను కలిసి సమ్మె అంశంపై అధికారికంగా నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు కన్వీనర్ గోపాల్ మిశ్రా తెలిపారు. ఇతర ప్రభుత్వ సంఘాలు కూడా తమ పోరాటంలో భాగం కానున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త పింఛను విధానం ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలకు అనుగుణంగా లేదన్నారు. అందుకే తాము పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. ⏰🚂


bottom of page