top of page
MediaFx

'మనమే' నుండి ఓహ్ మనమే సాంగ్ అవుట్

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శర్వానంద్ ఒక కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మనమే' అనే టైటిల్ ని ఖరారు చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని ఓహ్ మనమే అనే టైటిల్ తో ఈరోజు విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా జూన్ 7, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శర్వాకి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. విలక్షణమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

bottom of page