top of page
MediaFx

పవన్ కళ్యాణ్ “ఓజి” సినిమా క్రేజీ అప్‌డేట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి దీనిపై భారీ అంచనాలు నెలకొనగా లేటెస్ట్ గా సుజీత్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్రేజీ వివరాలు అందించాడు. అయితే వీటికి ముందు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం కూడా సాలిడ్ బజ్ నెలకొనగా ఆల్రెడీ దీనిపై థమన్ అందించిన హంగ్రీ చీతా క్రేజీ హిట్ అయ్యింది. ఇది పవన్ పాత్రని ఓ రేంజ్ లో ఎలివేట్ చేయగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ పవన్ విషయంలో వినిపిస్తుంది. దీనితో పవన్ ఓజాస్ గంభీర పై మరో క్రేజీ అండ్ పవర్ఫుల్ సాంగ్ ని థమన్ అందించినట్టుగా తెలుస్తుంది.మరి ఇదెలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా మేకర్స్ రెండు భాగాలుగా సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.

bottom of page