top of page
Suresh D

పవర్ స్టార్ పై ‘OG’ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..🎥✨

మొదటిసారి పవన్ సరసన మెయిన్ లీడ్ రోల్ పోషిస్తుంది ప్రియాంక. ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేసే ప్రియాంక.. తాజాగా అభిమానులతో ముచ్చటించింది.


తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. ఇండస్ట్రీలో ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గరయ్యింది. కంటెంట్ ప్రాధాన్యత.. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ఇప్పుడు బిజీగా ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు చిత్రాలు చేస్తుంది.. అందులో ఒకటి న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ కాగా.. మరొకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘OG’ ఒకటి. ఈ చిత్రానికి సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజీ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలతోపాటు.. పవన్ లుక్, రోల్ పై అభిమానులలో క్యూరియాసిటీ నెలకొంది. మొదటిసారి పవన్ సరసన మెయిన్ లీడ్ రోల్ పోషిస్తుంది ప్రియాంక. ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేసే ప్రియాంక.. తాజాగా అభిమానులతో ముచ్చటించింది.

తాజాగా తన ఇన్ స్టాలో ఫ్యాన్స్ చిట్ చాట్ నిర్వహించింది. ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ అభిమాని పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పండి అని అడగ్గా.. ప్రియాంక స్పందిస్తూ.. ‘ఆయన ఒక లెజెండ్.. అద్భుతమైన మనిషి. గొప్ప లీడర్. రియల్ పవర్ స్టార్’ అంటూ కామెంట్స్ చేసింది. ప్రియాంక మాటలపై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే మరో అభిమాని.. అక్క నువ్వు అనర్గళంగా ఎన్ని భాషలు మాట్లాడగలవు ? అని అడగ్గా.. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక మొత్తం 5 భాషలు తడబడకుండా మాట్లాడగలదని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. 

ఇక మరో అభిమాని.. ఫోన్ హోమ్ స్క్రీన్ వాల్ పేపర్ ఏంటని ? ప్రశ్నించగా.. అందుకు ప్రియాంక తన ఫోన్ వాల్ పేపర్ స్క్రీన్ షాట్ చేస్తూ.. మై ఫేవరెట్ హైసెన్ బర్గ్ అంటూ బదులిచ్చారు. దీంతో ప్రియాంక ఆన్సర్ చూసి షాకయ్యారు ఫ్యాన్స్. ఆమె కూడా బ్రేకింగ్ బ్యాడ్ లవర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రియాంక తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత శర్వానంద్ నటించిన శ్రీకారం మూవీలో కనిపించింది. కానీ ఈబ్యూటీకి తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు.🎥✨


Comments


bottom of page