top of page

🕊️👀 రాహుల్ ఆలయ దర్శనాన్ని అడ్డుకున్న అధికారులు..

👤 రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన తొలిరోజు నుంచే అనేక చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మణిపుర్ లో పాదయాత్ర ముగించుకుని అసోంలో అడుగుపెట్టిన సమయంలో యాత్ర నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

అనుమతి లేని ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగించారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే సోమవారం ఉదయం బటాద్రవ థాన్ అనే ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్‌ గాంధీని.. అక్కడి అధికారులు లోపలికి అనుమతిని నిరాకరించారు. దీంతో రాహూల్ గాంధీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘‘మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం. నేనేం నేరం చేశా? ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదు?.. మేం సమస్యల్ని సృష్టించడానికి రాలేదు. కేవలం పూజలు చేసి వెళ్తాం. ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీనే నిర్ణయిస్తారా ఏంటి? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే అలయంలోకి ప్రవేశించడాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను నిలదీశారు.

ఈ ఘటన తర్వాత నాగోవ్‌లో స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఇదిలా ఉంటే ఆలయ ఆలయ అధికారులు పలు విషయాలు వెల్లడించారు. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగుతున్నందున దర్శనాన్ని తాత్కాలికంగా మూసివేశామని చెప్పారు. అక్కడి కార్యక్రమాలు అన్నీ పూర్తైన తరువాత మధ్యాహ్నం 3 గంటలకు ప్రతి ఒక్కరినీ లోనికి అనుమతిస్తామని చెప్పుకొచ్చారు. అయితే.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే ఇవాళ ప్రాణప్రతిష్ట వేళ లోనికి అనుమతి ఉంటుందని ఒక ప్రకటన చేసినట్లు తెలిపింది ఆలయ కమిటీ. 🕊️🏛️

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page