top of page

మొదలైన వన్డే వరల్డ్‌కప్ ఫీవర్..🏏🏆

ఈసారి భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023 కి ఐసీసీ సిద్ధమవుతోంది. 🌍🏆🏏 అసలే మన దేశంలో క్రికెట్‌ను ఆరాధించే అభిమానులు ఎక్కువ కాబట్టి అందుకు తగ్గట్లే ఐసీసీ ఏర్పాట్లు చేస్తోంది. 🏏🇮🇳 అక్టోబర్‌ 5 వ తేదీన అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలయ్యే ఈ బిగ్ టోర్నీకి సంబంధించి ప్రచారాన్ని ఐసీసీ, బీసీసీఐలు గురువారం ప్రారంభించాయి.

ఈసారి భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023 కి ఐసీసీ సిద్ధమవుతోంది. 🌍🏆🏏 అసలే మన దేశంలో క్రికెట్‌ను ఆరాధించే అభిమానులు ఎక్కువ కాబట్టి అందుకు తగ్గట్లే ఐసీసీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్‌ 5 వ తేదీన అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలయ్యే ఈ బిగ్ టోర్నీకి సంబంధించి ప్రచారాన్ని ఐసీసీ, బీసీసీఐలు గురువారం ప్రారంభించాయి. ఇందులో భాగంగా ‘ఇట్‌ టేక్స్‌ వన్‌ డే’ అనే పేరుతో సరికొత్తగా ఓ ప్రచార వీడియోను విడుదల చేశాయి. 🏆 అన్ని రకాల ఎమోషన్స్‌ను జోడించి రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం క్రికెట్ ప్రేమికులను భావోద్వేగానికి గురి చేస్తోంది. 😍😢🤩 ఇంతకుముందు జరిగిన ప్రపంచకప్‌లలోని మరిచిపోలేని సన్నివేశాలు, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్‌ను నింపుతోంది. 🤩🏏 ఈ వీడియోకు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వాయిస్ ఓవ‌ర్‌ అందించడంతోపాటు వీడియో చివర్లో వరల్డ్‌కప్ ట్రోఫీని పట్టుకుని ఉన్నాడు. 🎙️🏆🎤 మాజీ క్రికెటర్లు, ప్రస్తుతం ఆట ఆడుతున్న ప్లేయర్లతో ఐసీసీ ఈ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. 🏏జేపీ డుమిని, శుభ్‌మన్‌ గిల్‌, దినేశ్‌ కార్తీక్‌, ఇయాన్‌ మోర్గాన్‌, ముత్తయ్య మురళీధరన్‌, జాంటీ రోడ్స్‌, జెమీమా రోడ్రిగ్స్‌ సహా చాలా మంది క్రికెటర్లు ఈ వీడియోలో కనిపించారు. వన్డే ప్రపంచకప్‌లోని కొన్ని మరిచిపోని సంఘటనలను ఈ వీడియోలో చూపించి.. ఫ్యాన్స్‌కు పాత రోజులను గుర్తుకు తెచ్చారు. 🏏యువరాజ్‌ సింగ్‌ ఉద్వేగం, చివరి బంతికి సిక్సర్‌ కొట్టి ఇండియాకు వరల్డ్‌కప్ అందించిన ధోనికి సంబంధించిన వీడియోను కూడా ఇందులో ఉంచారు.🏆🏏


תגובות


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page