నాన్‌వెజ్ తినని వాళ్లకి పనీర్ బెస్ట్ ఆప్షన్. ఒక పనీర్‌తో పాలక్ పనీర్, కడాయ్ పనీర్, పనీర్ 65, పనీర్ బటర్ మసాలా, పనీర్ టిక్కా ఇలా అనేక వెరైటీలు ఎంజాయ్ చేయవచ్చు. పన్నీర్‌తో చేసిన వంటకాలే కాదు.. దీనిలో పోషకాలు సూపర్‌గా ఉంటాయి. పాలను విరగొట్టి చేసే.. పనీర్‌లో కాల్షియం, విటమిన్ డి, విటమిన్ ఇ, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. పనీర్‌ను తరచుగా మన డైట్‌లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 😊
పనీర్‌లో విటమిన్ డి, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. పనీర్‌ను తరచు డైట్‌లో చేర్చుకుంటే.. గుల్లబారిన ఎముకలు గట్టిపడతాయి, ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుంది. కీళ్ల నొప్పులు దరిచేరకుండా ఉంటాయ్. మహిళలు పనీరు తరచు తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పనీర్ తీసుకుంటే.. రొమ్ము, కోలన్ వంటి క్యాన్సర్లు వచ్చే ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పనీర్‌లో ఉండే మంచి కొవ్వు, ప్రొటీన్ల వల్ల గర్భిణులకు వేవిళ్లు, అలసట, బలహీనత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్ ఈ రెండూ కడుపులోని బిడ్డ ఎదుగుదలకు, తల్లీబిడ్డల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. పనీర్‌లోని పోషకాలు మహిళలకు మెనోపాజ్ దశలో ఎదురయ్యే చిరాకు, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పనీర్‌లోని లిపిడ్లు, పొటాషియం హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. తద్వారా గుండె సమస్యలు రాకుండా రక్షిస్తుంది. పనీర్‌లోని ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇతర ఎముక సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తాయి. 🥗
పనీర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియక్రియకు మేలు చేస్తుంది. ఫైబర్ కడుపును నిండుగా ఉంచుతుంది, తద్వారా బరువు అదుపులో ఉంటుంది. పనీర్‌లోని మోనోశ్యాచురేటెడ్, పాలీఅన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు.. బరువును కంట్రోల్‌లో ఉంచుతాయి. పనీర్‌లోని పోషకాలు మనలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. ఈ సీజన్‌లో పనీర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ దొరుకుతుంది.విటమిన్ ఇ, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది తరచు డైట్‌లో చేర్చుకుంటే ముడతలు త్వరగా రావు. 🌱 ఇందులో ఉండే కాపర్ వల్ల జుట్టు కూడా దృఢంగా తయారవుతుంది.