🌟 విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావుకి జాతీయ గుర్తింపు దక్కుతోంది. ఎన్టీఆర్ పేరిట వందరూపాయల నాణెం విడుదల కానుంది.
సోమవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా ఈ నాణెం విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా నందమూరి కుటుంబం సభ్యులు హాజర్వుతారు. నాణెం ఆవిష్కరించిన తర్వాత ఎన్టీఆర్ జీవిత విశేషాలపై 20నిమిషాల వీడియోను ప్లే చేస్తారు. ఎన్టీఆర్ నాణానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ నాణెం తయారీకి నాలుగు లోహాలను వినియోగించారు. నాణెం చుట్టుకొలత 44 మిల్లీమీటర్లు ఉంటుంది. నాణెం తయారీలో 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్, 5శాతం జింక్ వినియోగించారు.
నాణెం ఇలా ఉంటుంది.. 🔍
ఎన్టీఆర్ నాణెం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే అనేక ఫొటోలు వైరల్ అవుతున్నా.. ఫుల్ క్లారిటీ మాత్రం విడుదల తర్వాత వస్తుంది. అయితే, ఎన్టీఆర్ నాణెంలో ఒకవైపు మూడు సింహాలు, అశోక చక్రం ఉండనున్నట్టు తెలుస్తోంది. రెండోవైపు ఎన్టీఆర్ చిత్రంతోపాటు వందేళ్లను సూచిస్తూ 1923 – 2023 ఉండబోతోంది. 🎥🦁🎬