top of page
MediaFx

ఇన్నాళ్లకు మళ్లీ ఆ హీరోయిన్‏తో ఎన్టీఆర్ స్టెప్పులు..


ఎన్టీఆర్ తో  జనతా గ్యారేజ్ తర్వాత మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా దేవర   పాన్ ఇండియా స్థాయిలో రెండు పార్టులుగా వస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తేంటే చాలా కాలం తర్వాత ఈ మూవీతో మరోసారి తారక్ మాస్ నటవిశ్వరూపం చూపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎలాగైన హిట్టు కొట్టాలనే కసిపై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు కొరటాల శివ.ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని అంటున్నారు. ఇందులో ఓ స్టార్ హీరోయిన్ కలిసి తారక్ స్టెప్పులు వేయనున్నారని టాక్. ఈ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్లను సంప్రదించి చివరకు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.

పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయడం ఇది మొదటి సారి కాదు… ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాటతో పూజా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇప్పుడు దేవరలోనూ స్పెషల్ సాంగ్ ఓ రేంజ్ లో ఉండనుందని అంటున్నారు. ఇన్నాళ్లు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న పూజా.. ఇప్పుడు దేవర స్పెషల్ పాటతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడట. అలాగే ఇప్పటికే స్పెషల్ సాంగ్ కూడా కంపోజ్ చేశాడట.


Comments


bottom of page