ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రావాలని ఉత్సవాల కమిటీ కన్వీనర్ జనార్ధన్, ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ వెళ్లి తారక్‌కు ఆహ్వాన పత్రం అందించారు. అయితే ఇప్పుడీ ఉత్సవాలకు తారక్ హాజరుకావడం లేదు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ’ ఆధ్వర్యంలో ఇవాళ (మే20)న హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహిస్తోంది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని కైతలాపూర్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు ఈ గ్రాండ్ ఈవెంట్‌ను జరపనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా ఈ ఉత్సవాల కోసం జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రావాలని ఉత్సవాల కమిటీ కన్వీనర్ జనార్ధన్, ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ వెళ్లి తారక్‌కు ఆహ్వాన పత్రం అందించారు. అయితే ఇప్పుడీ ఉత్సవాలకు తారక్ హాజరుకావడం లేదు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది.‘ హైదరాబాద్ వేదికగా జరిగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ హాజరుకావడం లేదు. ఇవాళ ఆయన పుట్టిన రోజు ఉండడంతో ముందస్తుగా కొన్ని ప్లాన్స్ ఉండడంతో ఈ మెగా ఈవెంట్‌లో తారక్ పాల్గొనడం లేదు. ఇందుకు ఆయన ఎంతో విచారం వ్యక్తం చేశారు. ఆహ్వాన సమయంలోనే ఆర్గనైజింగ్ కమిటీకి ఇదే విషయాన్ని తారక్ చెప్పారు ‘ అని జూనియర్ ఎన్టీఆర్ టీమ్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. కాగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రానున్నారు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, కన్నడ హీరో శివ రాజకుమార్, జయప్రద, అశ్వనీదత్ సహా పలువురు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.