top of page

🎬🤩 ఇక తెలుగులో '12th ఫెయిల్' చూసేయొచ్చు..🌟🎉

🎥 12th ఫెయిల్ సినిమా సృష్టించిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎస్ మనోజ్ కుమార్ రియల్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు విధు వినోద్ చోప్రా. విక్రాంత్ మస్సే- మేధా శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అటు బాక్సాఫీస్ దగ్గర తర్వాత ఓటీటీలో కూడా దుమ్మురేపింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఇది మస్ట్ వాచ్ సినిమా అంటూ నెటిజన్లు అందరూ ఏక కంఠంతో ఈ సినిమాను ప్రమోట్ చేశారు. అయితే ఓటీటీలో మాత్రం ఇప్పటివరకూ కేవలం హిందీలోనే ఈ సినిమా అందుబాటులో ఉండేది. కానీ తాజాగా సౌత్ ఇండియన్ ఆడియన్స్‌కి గుడ్ న్యూస్ ఇచ్చింది హాట్ స్టార్. 🎉👏

తెలుగు సహా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 29 నుంచి హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తుంది. అయితే నేటి నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ఇన్‌స్పైరింగ్ స్టోరీ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా తెలుగువ ఆడియన్స్‌ ఈ సినిమాను తమ మాతృభాషలో చూసేందుకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికపై తరచుగా ఈ డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకి వారి కోరిక తీరింది. మరి సౌత్ ఇండియన్ భాషల్లో ఈ సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి. 🍿📺

bottom of page