సస్పెక్షన్‌కు గురైన విపక్ష ఎంపీలు చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే. సస్పెన్షన్‌కు గురైన అనంతరం కొందరు ఎంపీలు మంగళవారం పార్లమెంట్ గేటు వద్ద నిరసన తెలిపారు. అయితే ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వ్యవహరించిన తీరు వివాదస్పంగా మారింది.
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ్య ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ను మిమిక్రీ చేశారు. మాక్ పార్లమెంట్‌ను నిర్వహించిన కళ్యాణ్ బెనర్జీ, జగదీప్ ధన్‌కర్‌ను అనుకరించారు. ‘నా వెన్నూప నిటారుగా ఉంది. నేను చాలా పొడుగ్గా ఉన్నంటూ’ ఉపరాష్ట్రపతిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. మిమిక్రీ చేస్తూ అవహేలన చేశారు. దీంతో ఈ అంశం కాస్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తిని ఇలా అవహేలన చేయడం దారుణమంటూ పలువురు బీజేపీ నాయకులు ఖండించారు.
ఇక తనపై వచ్చిన విమర్శను జగదీప్ ధన్‌కర్ తప్పుపట్టారు. ఎంపీల ప్రవర్తన ఆమోదయోగ్యంగా లేదని విమర్శించారు. ఛైర్మెన్ స్థానంలో ఉన్న వ్యక్తిని అనుకరిస్తూ, మిమిక్రీ చేయడం దారుణమని, చాలా సిగ్గుచేటు చర్య అని ధన్‌కర్ విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా ఇదే విషయమై భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ధనకర్‌తో మాట్లాడారు. స్వయంగా ఫోన్ చేసి ఈ విషయమై ఆరా తీశారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్‌కర్ స్వయంగా తెలిపారు. 🗣️👤