🇮🇳 దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు 40 వేల సాధారణ బోగీలను వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 📆
గురువారం లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్ 2024ను ప్రవేశపెడుతూ ఆమె ఈ ప్రకటన చేశారు. 📢 దేశ ఆర్థికాభివృద్ధికి భారతీయ రైల్వే ఒక చోదక శక్తిగా పేర్కొన్న మంత్రి.. రైల్వే శాఖను మూడు ప్రధాన ఆర్థిక కారిడార్‌లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 🌐 ఇందులో మొదటిది ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కారిడార్ కాగా, రెండోది నౌకా అనుసంధాన కారిడార్, మూడోది ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్ గా పేర్కొన్నారు. 🚢 వీటిని ప్రధాని గతిశక్తి పథకం కింద గుర్తించి వివిధ మార్గాల ద్వారా అనుసంధానించనున్నట్లు తెలిపారు. 🚅 రవాణా సాంద్రత కారిడార్స్ ద్వారా ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలు మెరుగుపరిచి వేగవంతమైన, సురక్షితమైన రైలు సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. 🚆 ఇందులోభాగంగా వందే భారత్ వంటి సెమీ-హైస్పీడ్ రైళ్లను ఇప్పటికే రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. 🚄 విడతల వారీగా వీటి సర్వీసులను దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. త్వరలో వందే భారత్ స్లీపర్ కోచ్‌లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 🛌 రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో కంటే వీటిలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి. 🚉