top of page

🗓️ ఈ నెల ఎవ్వరూ కరెంట్ బిల్లులు కట్టొద్దు...🏠💡

🚨 బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతులో బొంద పెడతామంటూ లండన్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. 🗣️📢

పులి బయటకు వస్తే, బోనులో బంధిస్తామంటూ రేవంత్‌ హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు. 100 మీటర్ల లోపల పార్టీని బొందపెట్టే సంగతి తర్వాత చూద్దామని.. వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలపై దృష్టిపెట్టాలంటూ కేటీఆర్‌ హితబోధ చేశారు. 🤔🌐 అహంకారంతో మాట్లాడిన రేవంత్‌ వంటి నేతలను BRS తమ ప్రస్థానంలో చాలామందిని చూసిందని చెప్పారాయన. ‘తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్’ అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చినందుకా అని నిగ్గదీసి అడిగారాయని.

🔍 దీంతోపాటు కరెంట్ బిల్లులపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దని పిలుపునిచ్చారు. కరెంటు బిల్లుల గురించి అడిగితే అధికారులకు సీఎం గతంలో చేసిన మాటలను చూపించాలని కేటీఆర్ సూచించారు. 💬🔊 సోనియా గాంధీ బిల్లు కడతారని రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని ఆయన వివరించారు. కరెంటు బిల్లుల ప్రతులను సోనియా ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు. 🌐💡 హైదరాబాద్‌లోని ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 💡🏡✉️

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page