top of page

💔ట్రిపుల్ ఐటీలో ఆగని ఆత్మహత్యలు..📚

🏫 బాసర ట్రిపుల్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. 🎓💔 ఇంఛార్జ్ వీసీగా వెంకటరమణ వచ్చాక పరిస్థితిలో మార్పు వస్తుందేమో అనుకుంటే సమస్యల‌ సుడిగుండం నుండి బయటపడలేక.. 🙏💔

విద్యార్థుల ఆత్మహత్యలతో మరింత ఊబిలోకి కూరుకుపోతోంది. 😔💔 ఆత్మహత్యలను అరి కట్టేందుకు ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలు ఏవీ ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. 🙏💔 జూన్ 13న దీపిక , జూన్ 15న లిఖిత, తాజాగా ఆగష్టు8 న జాదవ్‌ బబ్లూ.. 💔📚 వీళ్లంతా పీయూసీ వన్ విద్యార్థులే కావడంతో కొత్తగా వస్తున్న విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. 📚🧠 సంగారెడ్డి జిల్లా నారయణ్ ఖేడ్ మండలం నాగపూర్ తండాకు చెందిన జాదవ్ బబ్లూ పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి.. 📖🏅 ట్రిపుల్ ఐటీలో మొదటి విడత కౌన్సిలింగ్‌లో సీటు సాధించగా.. 🎓✨ ఈనెల 1న క్యాంపస్‌లోకి అడుగు పెట్టాడని సమాచారం.

🤝💔 అయితే కేవలం వారం రోజుల వ్యవధిలోనే జాదవ్ ఆత్మహత్య చేసుకోవడం క్యాంపస్‌లో తీవ్ర కలకలం రేపింది. 🏫💔 బబ్లూ క్లాస్‌లకు హాజరైంది కేవలం ఒక్క రోజే కావడంతో అసలు బబ్లూ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనేది‌ ఇప్పటికీ అనేక అనుమానాలకు తావిస్తోంది. 💬📝 సూసైడ్ నోట్ రాశాడని తెలుస్తున్నా.. 💭💔 ఆ నోట్‌లో ఏముందన్నది ఇప్పటికీ బయటకు రాలేదు. 🔍💔 అయితే క్యాంపస్ పోలీసులు మాత్రం జాదవ్ బబ్లూ నాయక్ వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదంటున్నారు. 🚔🙏


Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page