📱నోకియా 130, నోకియా 150 పేర్లతో రెండు ఫోన్‌లను తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. స్మార్ట్ ఫోన్‌లు వద్దనుకునే వారికి, స్క్రీన్ టైమ్ పెరుగుతుందని ఆందోళన చెందే వారిని టార్గెట్ చేస్తూ నోకియా ఈ కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తోంది.
📱 నోకియా 130.. 📱 నోకియా 130 ఫీచర్ ఫోన్‌లో 2.4 ఇంచెస్ QVGA డిస్‌ప్లేను అందించారు. ఇందులో 1450 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన రిమూవబుల్ బ్యాటరీని ఇచ్చారు. అయితే ఈ ఫోన్‌లో కెమెరా ఆప్షన్‌ను ఇవ్వలేదు. కీప్యాడ్‌తో వచ్చే ఈ ఫీచర్ ఫోన్‌లో స్నేక్ గేమ్‌ను సరికొత్త వెర్షన్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను ఒక్కసారిగా ఛార్జ్ చేస్తే ఏకంగా నెల రోజుల వరకు స్టాండ్ బై వస్తుంది.
📱 నోకియా 150.. 📱 ఇక నోకియా 150 ఫీచర్ ఫోన్ విషయానికొస్తే ఇందులో 2.4 ఇంచెస్ QVGA డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో కెమెరాను ఇచ్చారు. 0.3 మెగా పిక్సెల్ ఈ కెమెరా కెపాసిటీ. ఇక ఇందులో మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్‌ను కూడా అందించారు. దీంతో పాటలు ప్లే చేసుకోవచ్చు. ఇక ఇందులోని 1450 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో ఏకంగా నెల రోజుల పాటు స్టాండ్‌బై టైం ఇస్తుంది.