🏰🕉️🕌 నార్పల మండలం గూగుడు శ్రీ కుళ్ళాయిస్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలోకి మహిళలు ప్రవేశించరు… 👩🦳🚶♀️💃🏰
ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ ఆలయంలోకి మహిళలు ఎవరూ వెళ్ళరు అనే ఆచారం ఉంది. కానీ గుడిలోకి మహిళలు రాకూడదు అనే నిబంధన మాత్రం లేదు. 13 సంవత్సరాల లోపు ఆడపిల్లలు లోపలికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకుంటారు. కాని 13 సంవత్సరాలు పైబడిన మహిళలు వారంతట వారే గుడిలోకి ప్రవేశించరు. ఆడవాళ్లు నెలసరి సమయాల్లో సాధారణంగానే ఏ గుడిలోకి వెళ్ళరు. 🌝🏰 🙏🕉️🕯️🏰 ఇక మాజీ మంత్రి శైలజనాథ్ మంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి గూగూడు గ్రామంలోని కుళ్ళాయి స్వామి గుడిలోకి దర్శనం చేసుకొని వెళ్ళిన తరువాత యాక్సిడెంట్ లో చెయ్యి విరిగింది. అందుకని అప్పటి నుండి మాజీ మంత్రి శైలజనాథ్ కూడా గుడి బయటే ఉండి దర్శనం చేసుకుంటారు తప్ప, గుడిలోకి ప్రవేశించరు. 🚗🚧🏰 🙏🕉️🕯️🏰 వాస్తవానికి గూగుడు గ్రామంలోని దళితులు కూడా గుడిలోకి ప్రవేశించరు. ఇది కూడా అనాదిగా వస్తున్న అనవాయితీ మాత్రమే… దళితులు ప్రవేశించకూడదని ఎవరు ఎటువంటి ఆంక్షలు విధించలేదు. కొన్ని ఏళ్ళుగా ఇక్కడి ఆచారం ప్రకారం మహిళలు, దళితులు ఆలయంలోకి ప్రవేశించరు. బయట నుంచే స్వామివారిని దర్శించుకుంటారు. 🏰🚶♂️🚶♀️🚶♂️🚶♀️