top of page
Shiva YT

📢 బిహార్‌ ముఖ్యమంత్రి పదవికి నితీష్‌కుమార్‌ రాజీనామా 🎉

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, అదే పదవిని అలా అందుకోబోతున్నారు నితీష్‌కుమార్‌. ఈ సాయంత్రం ఐదు గంటలకు రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ఈ సీనియర్‌ పొలిటీషియన్‌ ప్రమాణం చేస్తారు. ఈ ఉదయం దాకా ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్‌ మద్దతుతో ముఖ్యమంత్రిగా ఉంటే, సాయంత్రం మాత్రం బీజేపీ మద్దతుతో అదే కుర్చీలో కూర్చుంటారు. 🌟

— ఇప్పటివరకు 8సార్లు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు నితీష్‌కుమార్‌. అయితే ఒక్కసారి కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ప్రతిసారి కూడా ఏదోఒక పార్టీతో జత కట్టే సీఎం పగ్గాలు అందుకున్నారు నితీష్‌. అయితే, ఇక్కడా సూపర్‌ ట్విస్ట్‌ ఉంది. జేడీయూకి తక్కువ సీట్లు వచ్చినా… ప్రతిసారీ ముఖ్యమంత్రి మాత్రం నితీష్‌ కావడం అసలు ట్విస్ట్‌. 🔀

— నితీష్‌… ఎప్పుడు ఏ పార్టీతో జతకట్టి సీఎం పీఠం ఎక్కారో… ఇప్పుడు చూద్దాం. 🤔

— ఒకటోసారి: 2000 మార్చి 3 (బీజేపీతో కలిసి)

— రెండోసారి : 2005 నవంబర్‌ 24 (బీజేపీతో కలిసి)

— మూడోసారి : 2010 నవంబర్‌ 26 (బీజేపీతో కలిసి)

— నాలుగోసారి : 2015 ఫిబ్రవరి 22 (ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి)

— ఐదోసారి : 2015 నవంబర్‌ 20 (ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి)

— ఆరోసారి : 2017 జులై 27 (బీజేపీతో కలిసి)

— ఏడోసారి : 2020 నవంబర్‌ 16 (బీజేపీతో కలిసి)

— ఎనిమిదోసారి : 2022 ఆగస్ట్‌ 9 (ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి)

— తొమ్మిదోసారి : 2024 జనవరి 28 (ఇప్పుడు బీజేపీతో కలిసి) 📆✨


bottom of page