top of page

🌟 నితిన్, శ్రీలీల స్టెప్పులు..‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మాస్ సాంగ్.

🎬 శంషాబాద్‏లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‏లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుందని.. ఈ పాటతోనే మొత్తం ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కానుందని టాక్.

ఇక ఆ తర్వాత ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. అయితే ఇప్పటికే తన డ్యాన్స్‏తో వెండితెరపై అదరగొట్టేస్తోంది శ్రీలీల. ఇటు నితిన్ సైతం మంచి డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇద్దరూ సూపర్ డ్యాన్సర్ కాంబోలో అది కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రాబోతున్న ఈ మాస్ సాంగ్ మరోసారి నెట్టింటిని షేక్ చేయడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు ట్విట్టర్ వేదికగా శ్రీలీల హ్యాష్ ట్యాగ్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. 🌟 ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే రావు రమేష్, క సంపత్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిరా ఎంటర్టైన్మెంట్స్ సహకారంతో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 8న ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. 🎥✨

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page