యంగ్ హీరో నిఖిల్ తాజా చిత్రం 'స్పై'. జూన్ 29న ప్రేక్షకులకు మందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. మిక్సడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ లేటెస్ట్ మూవీ 'స్పై' (SPY Movie). ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు మిక్సడ్ టాక్ వచ్చినప్పటికే ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. నిఖిల్ కెరీర్ లో ఇవే బిగ్గిస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా అనుకున్న అంచనాలు అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఈ చిత్రం హిందీతో సహా ఐదు భాషల్లో విడుదలైంది.
అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందనే ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇది జూలై చివరిలో లేదా ఆగస్టు మెుదటి వారంలో ప్రేక్షకుల మందుకు వచ్చే అవకాశం ఉంది. కార్తికేయ-2తో నిఖిల్‌కు పాన్ ఇండియన్ లెవెల్‌లో మార్కెట్ ఏర్పడింది. దీంతో స్పై డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి దాదాపు నలభై కోట్లకుపైనే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
ఎడిటర్ గ్యారీ బీహెచ్ 'స్పై' సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా ఐశ్వర్యమీనన్, సాన్యా ఠాకూర్ నటించారు. ఆర్యన్ రాజేష్ కీలక పాత్రను పోషించగా...రానా దగ్గుబాటి అతిథి పాత్రలో మెరిశాడు. ఈ సినిమాకు అనిరుధ్ కృష్ణ మూర్తి, రాజశేఖర్ రెడ్డి కథ అందించారు. చరణ్ తేజ్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో 'జై' అనే రా ఏజెంట్ చేశాడు నిఖిల్. తన సోదరుడి((ఆర్యన్ రాజేష్)ను ఎవరు చంపారో తెలుసుకోవడంతోపాటు దేశంలో కుట్రలకు ప్లాన్ చేస్తోన్న ఓ టెర్రరిస్ట్‌ను రా ఏజెంట్ ఎలా పట్టుకున్నాడన్నదే ఈ సినిమా స్టోరీ.