హీరో నిఖిల్ లేటెస్ట్ మూవీ స్పై. ఇటీవల రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే ఉన్నా.. తర్వాత రోజు నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. నిఖిల్ అభిమానులను ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ కు, తన ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పాడు నిఖిల్. సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ ను కూడా రిలీజ్ చేశారు. ''నాపై మీరు ఉంచిన నమ్మకానికి చాలా ఆనందంగా ఉంది. కాంట్రాక్ట్/ కంటెంట్ డీలే సమస్యల కారణంగానే ఈ మూవీని ఇండియా వైడ్ గా అన్ని భాషల్లో విడుదల చేయలేకపోయాం. అది నాకు చాలా బాధ అనిపించింది. ఓవర్సీస్ లోనూ 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలుపుతున్నాను. నా రాబోయే 3 చిత్రాలు అన్ని భాషల్లో థియేటర్లలో పర్ఫెక్ట్ గా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతాయని మాట ఇస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన ప్రతి తెలుగు మూవీ లవర్ కు కూడా చెబుతున్నాను. ఇకపై నాణ్యత విషయంలో అస్సలు రాజీపడను. ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా మంచి క్వాలిటీతో సినిమాను అందిస్తాను'' అని నిఖిల్ చెప్పారు. స్పై రిజల్ట్‌పై నిఖిల్ చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి అతిథి పాత్రలో కనిపించాడు. ఈ మూవీకి మిక్సడ్ టాక్ వచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ. 28.90 కోట్లు సాధించింది.