top of page

🎟️మేనియా.. డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్‌కు వంద టికెట్లు ఇచ్చిన నిఖిల్ 🎟️

సలార్ టికెట్ల కోసం ప్రభాస్ అభిమానులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. 🌠 ఇక మిడ్ నైట్ షోలు, తెల్లవారుఝాము షోలు వేయడంతో టికెట్ల వేటను కొనసాగించారు. 🌌 టికెట్లు దొరక్క చాలా మంది ట్విట్టర్లో తమ నిరాశను వెల్లగక్కారు.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రం నిఖిల్ గతంలోనే ఓ ఆఫర్ ఇచ్చాడు. 🤩ప్రభాస్ సలార్ మేనియా ఎలా ఉందో అందరికీ తెలిసిందే. 🌟 సలార్ దెబ్బకు నేషనల్ వైడ్‌గా రికార్డులు బద్దలవుతున్నాయి. 📽️ సలార్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. 💥 బుక్ మై షోలు క్రాష్ అవుతున్నాయి. 💻 ఆఫ్ లైన్, ఆన్ లైన్లో టికెట్లు దొరక్క ప్రభాస్ ఫ్యాన్స్ అల్లాడిపోయారు. 😔అర్ధరాత్రి షోలు పడ్డాయి. 🌃 టికెట్ల కోసం నానా కష్టాలు పడుతూ వచ్చారు. 😓 అయితే ప్రభాస్ అభిమానులకు ఓ వంద టికెట్లు ఇస్తానంటూ గతంలోనే మాటిచ్చాడు. 🌠 అయితే చెప్పినట్టుగానే ఆ వంద టికెట్లు ప్రభాస్ అభిమానులకు ఇచ్చాడు. 🎁 వంద మంది డై హార్డ్ ఫ్యాన్స్‌ను స్వయంగా కలిసి ఆ టికెట్లను నిఖిల్ ఇచ్చాడు. 🤗 ఇలా ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కు నిఖిల్ టికెట్లు ఇవ్వడంతో నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 🎉ఇలా ఓ హీరో.. ఇంకో హీరో సినిమాను ఇంతలా ప్రోత్సాహించడం, ఇతర హీరోల అభిమానులకు టికెట్లు ఇవ్వడం అభినందనీయమైన విషయం అని అంటున్నారు. 🌟 ఇక ప్రభాస్‌కు ఎంత పెద్ద అభిమాని అన్నది ఈ ఘటనతోనే అర్థం అవుతోందని నిఖిల్ మీద డార్లింగ్ ఫ్యాన్స్ ప్రేమను కురిపిస్తున్నారు. చెప్పినట్టుగానే సలార్‌కు వంద టికెట్లు ఇచ్చానని, ఇండియన్ సినిమా జయ కేతనం ఎగరేయాలన్నట్టుగా నిఖిల్ ట్వీట్ వేశాడు. 🙌 నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియన్ సబ్జెక్టులతో బిజీగా ఉన్నాడు. 📚 కార్తికేయ 2 నేషనల్ వైడ్‌గా క్లిక్ అయింది. జేస్ తెలుగులో భారీ హిట్ అయింది. 👏 కానీ స్పై సినిమా బెడిసి కొట్టేసింది. 🎥 ఇప్పుడు నిఖిల్ పూర్తి జాగ్రత్తలు తీసుకుని స్వయంభు అనే మూవీని తీస్తున్నాడు. 🎬 కార్తికేయ 3 కూడా లైన్లో ఉందన్న సంగతి తెలిసిందే. 📰 మరి నెక్ట్స్ పాన్ ఇండియా వైడ్‌గా నిఖిల్ సందడి ఎలా ఉంటుందో చూడాలి. 🤔

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page