📌 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల్లో రోజుకో కొత్త టెన్షన్ కనిపిస్తోంది. 🤔 ఇంటికి రెండు లేదా మూడు టికెట్లు కావాలంటూ కీలకనేతల పట్టు ఓ పక్క, బీసీలకు పార్లమెంటు నియోజకవర్గానికో అసెంబ్లీ
సీటు ఇవ్వాలన్న డిమాండ్ మరో పక్క, ఇతర పార్టీలునుంచి వచ్చిన ఆశావహుల డిమాండ్లు ఇంకో పక్క టీ కాంగ్రెస్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 😓 ఈ పరిస్థితుల్లో తాజాగా ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌పై స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ మాట్లాడారు. 🗣️ ఇక ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని, మైనార్టీలు, మహిళలు, బీసీలకు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 👍
ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారమే ఆశావాహులకు సీట్లు దక్కితే.. తమతోపాటు వారసులను రంగంలోకి దించాలని భావిస్తున్న వారి ఆశలు గల్లంతైనట్లేనా? 😅 కాంగ్రెస్ పార్టీలో దాదాపు 9 కుటుంబాలు వారసులు, కుటుంబసభ్యులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. 🏡 వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఈ సారి తన ఇద్దరు కుమారులను రంగంలోకి దించారు. 🙌 పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి, చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి కోసం ఆయన నాగార్జున సాగర్, మిర్యాలగూడ టికెట్లు ఆశిస్తున్నారు. 🤝 సకుటుంబ సమేతంగా టికెట్లు ఆశిస్తున్న నేతల్లో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు. 👏 తనతో పాటు తన సతీమణి పద్మావతిని పోటీ చేయించే పనిలో ఉన్నారాయన. 🌈 తాను హుజూర్‌నగర్ నుంచి, కోదాడ నుంచి పద్మావతి కోసం అప్లై చేశారాయన. 🏆 మరో సీనియర్ నేత దామోదర రాజనరసింహ తనతో పాటు తన కుమార్తెకూ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ✨