top of page

ఏపీ, తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షులు.. సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్!

తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్పులకు బీజేపీ హైకమాండ్ శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తుంది. దీనితో అటు ఏపీ ఇటు తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షులు రాబోతున్నట్టు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్పులకు బీజేపీ హైకమాండ్ శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తుంది. దీనితో అటు ఏపీ ఇటు తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షులు రాబోతున్నట్టు సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), ఏపీ బీజేపీ అధ్యక్షునిగా సత్యకుమార్ (Sathyakumar)ను నియమించనున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఈ సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. కాగా ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ (Bandi Sanjay), ఏపీ బీజేపీ అధ్యక్షునిగా సోము వీర్రాజు (Somu veerraju) ఉన్న విషయం తెలిసిందే.

కాగా అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ వైదొలగడానికి సుముఖంగా లేరని..అలాగే కిషన్ రెడ్డి మళ్లీ రాష్ట్ర పగ్గాలు చేపట్టడానికి ససేమిరా అంటున్నట్టు తెలుస్తుంది. అయితే హైకమాండ్ ఆదేశిస్తే మాత్రం ఈ మార్పులు అమలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తుల అభిప్రాయం కంటే పార్టీ ప్రయోజనాల కోసం అధిష్టానం ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఉండగా..ఆయనకు కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవాలనే భావనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్న బండి సంజయ్ కు జేపీ నడ్డా కీలక సూచన చేసినట్లు తెలుస్తుంది. నాయకత్వ మార్పు అవసరమని..అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని బండికి నడ్డా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఢిల్లీలో మీ అవసరాలను వాడుకుంటామని జేపీ నడ్డా చెప్పినట్టు తెలుస్తుంది. మరి దీనిపై ఈరోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

హైదరాబాద్‌కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఘనస్వాగతం పలికిన సీఎం కేసీఆర్

కాగా తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో కిషన్ రెడ్డి వివాదరహితునిగా పేరుంది. దీనితో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీలో తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఏపీలో సోము వీర్రాజు పదవి కాలం ముగుస్తుంది. అలాగే ఆయన ప్రజల్లోకి వెళ్లలేదనే భావన ఉంది. ఇక దీనిపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు జేపీ నడ్డా ఫోన్ చేసి చెప్పారని..అలాగే కొత్త బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారని అన్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page