దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌చేస్తోంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ06 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌లో ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించనున్నారు.
ఇక ఈ ఫోన్‌లో 15 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెసాపిటీతో కూడిన బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను బ్లాక్ కలర్‌లో లాంచ్‌చేయనున్నారు.
గ్యాలక్సీ ఎ06 స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ధర విషయానికొస్తే కంపెనీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్లె వంటి ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక నెట్టింట లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు.
ఈ ఫోన్‌లో రెయిర్ సైడ్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌లో టైప్ సీ పోర్ట్‌ను అందించనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌ను గ్యాలక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 ఫోన్లలో మాదిరిగా కీ ఐలాండ్‌తో రానుంది.