top of page

ఎన్నడూ ట్రోఫీ ఎత్తని నీకే అంతుంటే..మరి నాకెంత ఉండాలి..


టీ20 ప్రపంచకప్ భారత జట్టుకు అనుకూలంగా ఉందని మైఖేల్ వాన్ చేసిన ప్రకటనను టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రవిశాస్త్రి టార్గెట్ చేశారు. ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ జట్టుకు అనుకూలంగానే అన్ని మ్యాచ్‌లు షెడ్యూల్‌లు చేశారని మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు. వాన్ చేసిన ఈ ప్రకటనపై రవిశాస్త్రి ఫైర్ అయ్యారు. మైఖేల్ వాన్ ముందుగా తన జట్టు గురించి ఆలోచించాలంటూ చెప్పుకొచ్చాడు.

మైకేల్ వాన్‌కు ఇచ్చి పడేసిన రవి శాస్త్రి..

వాస్తవానికి, 2024 T20 ప్రపంచ కప్ సమయంలో ICC భారత జట్టుకు అనుకూలంగా ఉందని మైఖేల్ వాన్ ఆరోపించారు. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు సౌలభ్యం మేరకు మ్యాచ్‌లను షెడ్యూల్ చేసినట్లు వాన్ చెప్పుకొచ్చాడు. వాన్ ప్రకారం, భారత్ మ్యాచ్‌లు ఆడాలనుకున్నప్పుడు మాత్రమే నిర్వహించారు. ఈ టోర్నీ భారత్‌కు మాత్రమే చెందిదంటూ చెప్పుకొచ్చాడు. వాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడుకుంటారు. తమ సెమీ ఫైనల్స్ ఎక్కడ జరుగుతాయో వారికి ముందే తెలుసు. వారు వెస్టిండీస్‌లో ప్రతి మ్యాచ్‌ను ఉదయం ఆడతారు. తద్వారా భారత అభిమానులు రాత్రి మ్యాచ్‌ను సులభంగా వీక్షించవచ్చు అంటూ కామెంట్స్ చేశాడు.మైఖేల్ వాన్ చేసిన ఈ ప్రకటనపై రవిశాస్త్రి తిప్పికొట్టారు. టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మైఖేల్ వాన్ తనకు ఏది కావాలంటే అది మాట్లాడగలడు. ఆయన ప్రకటనల వల్ల భారతదేశంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగదు. ముందుగా వాన్ ఇంగ్లండ్ జట్టును హ్యాండిల్ చేసుకోవాలి. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఏమి జరిగిందో తోలుసుకోవాలి. భారత జట్టు ప్రపంచకప్ ట్రోఫీని చాలాసార్లు గెలుచుకుంది. నాకు తెలుసు ఇంగ్లండ్ రెండు సార్లు గెలిచింది. కానీ భారత్ 4 ట్రోఫీలు గెలుచుకుంది. మైఖేల్ వాన్ ప్రపంచకప్ గెలవలేదని నేను అనుకోను. అందుకే మాట్లాడే ముందు ఆలోచించాలి. అతను నాతో పని చేస్తున్నాడు. ఇదే అతనికి నా సమాధానం అంటూ ఇచ్చి పడేశాడు. దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page