top of page
MediaFx

నెట్టింట వైరల్‌గా మారిన కోకోనెట్ మటన్ లివర్ కర్రీ..


మటన్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మటన్‌లోని అన్నీ శరీరానికి కావాల్సినేవే. అందులోనూ లివర్‌తో మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ లివర్‌తో వెరైటీగా ఇలా వండారు. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. చూస్తుంటేనే నోరు ఊరి పోతుంది. మటన్ రోగన్ జోష్ అయినా, మటన్ కబాబ్ అయినా, రైల్వే స్టైల్ కర్రీ అయినా చాలా రుచిగా ఉంటాయి. వీటికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. మీరు ఈ క్లాసిక్ వంటకాలకు అభిమాని అయితే, ఖచ్చితంగా ఏదైనా కొత్తదాన్ని ప్రయత్నించాలని కోరుకుంటే ఇప్పుడు ఈ కొబ్బరి మటన్ లివర్ కర్రీని కూడా ట్రై చేయండి. ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎస్.ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వంటను అందించారు. మరి ఎలా తయారు చేశారో మీరే ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘చాలా కొత్తగా చేశారని’ ఒకరు అంటే.. ‘గ్రేట్ రెపిపీ.. కాస్త శ్రమ తప్పదు’, మరొకరు ‘ఇలా కూడా చేయవచ్చా? నిజంగానే ఆ కర్రీ ఉడికిందా?’, ‘చాలా కొత్త రెసిపీ’, ‘కొబ్బరి కాయలో మటన్ లివర్.. ఇప్పటి వరకూ ఇలాంటి రెసిపీ చూడలేదు’.. ఇలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



bottom of page